Sunday, December 22, 2024

తిరుమలగిరిలో కాంగ్రెస్‌లో వర్గపోరు

- Advertisement -
- Advertisement -

తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్‌లో వర్గపోరు ప్రారంభమైంది. స్థానిక నేతలు ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష కోసం ఫ్లెక్సీలు కట్టారు. ఆ ఫ్లెక్సీలను కాంగ్రెస్‌లోని మరో వర్గం చించివేసింది. గత కొంత కాలంగా కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జీ అద్దంకి దయాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ దామోదర్ రెడ్డి గ్రూపుల మధ్య వర్గపోరు ఉన్నట్టు ఆ పార్టీ స్థానిక నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. గతంలో దామోదర్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గ్రూపు రాజకీయాలతోనే అద్ధంకి దయాకర్ రెండు సార్లు తక్కువ మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారని అద్దంకి గ్రూప్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News