Sunday, December 22, 2024

తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీం కోర్టు తాజా దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

ఐదుగురు సభ్యులతో ‘సిట్’ ఏర్పాటు

న్యూఢిల్లీ: తిరుపతి లడ్డు వివాదంపై తాజా దర్యాప్తుకు సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్యవులు జారీ చేసింది. అంతేకాక ఐదుగురు సభ్యులతో కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ‘సిట్’లో సిబిఐ, ఆంధ్ర పోలీస్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారులు ఉంటారు.

సిట్ విచారణను సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయస్థానాన్ని “రాజకీయ యుద్దభూమి”గా ఉపయోగించుకోడానికి అనుమతించబోమని న్యాయమూర్తులు బిఆర్.గవాయ్ , కెవి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ల బ్యాచ్‌పై ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రయోగశాల పరీక్ష నివేదిక “అస్సలు స్పష్టంగా లేదు” అని సుప్రీం కోర్టు పేర్కొంది, “తిరస్కరించబడిన నెయ్యి” పరీక్షకు లోబడిందని ప్రాథమికంగా సూచించింది. రాష్ట్రం కథనం ప్రకారం సెప్టెంబర్ 25 న ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి సెప్టెంబర్ 26న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయడం జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News