Wednesday, January 22, 2025

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి!

- Advertisement -
- Advertisement -

సుప్రీంకోర్టులో కెఏ. పాల్ పిటిషన్

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ. పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తిరుమల లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. కేవలం 744 మంది క్యాథలిక్స్ ఉండే వాటికన్ సిటీ ప్రత్యేక దేశంగా ఉందని, కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తప్పేముందని ప్రశ్నించారు.

100 రోజుల కూటమి   ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని సిఎం చంద్రబాబు జనంలోకి తీసుకొచ్చారని పాల్ విమర్శించారు. లడ్డూ నాణ్యతపై జులై నెలలో ల్యాబ్ రిపోర్ట్ వస్తే… దాని గురించి సెప్టెంబర్ లో మాట్లాడటమేమిటని ప్రశ్నించారు.

లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో మధ్యంతర ఉత్తర్వులను కోరుతూ పిటిషన్ వేశానని కెఏ. పాల్ తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. వీరు లడ్డూ గురించి మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్ లో కోరానని వెల్లడించారు. లడ్డూలో కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని… భక్తుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News