Thursday, January 23, 2025

తిరుమలలో కొత్త నిబంధనలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ అమల్లోకి వస్తోంది. తిరుమలలో ప్రధానంగా.. శ్రీవారి సర్వ దర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టిటిడి ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చేసింది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టొచ్చంటున్న అధికారులు వెల్లడించారు. మరోవైపు శ్రీవాణి టికెట్ల కోటాను కూడా టిటిడి పెంచింది. తిరుమలలో జారీ చేసే కరెంట్ బుకింగ్ శ్రీవాణి దర్శన దాతల టికెట్ల కోటాను పెంచింది. ప్రస్తుతం రోజూ వెయ్యి మందికి ఈ టికెట్లను టిటిడి జారీ చే స్తోంది.

750 ఆన్‌లైన్‌లో, 150 టికెట్లు తిరుమలలోని గోకులంలో, మరో వంద టికెట్లను తిరుపతి ఎయిర్‌పోర్ట్ కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తున్నారు. నేటి నుంచి ఆన్‌లైన్ కోటాను 750 నుంచి 500కు కుదించి.. గోకులం కార్యాలయంలో 150 నుంచి 400కు టికెట్ల కోటాను పెంచింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తలనీలాలు తీసే క్షురకులు ఇన్ఫెక్షన్లు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తిరుపతికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కృష్ణప్రశాంతి సూచించారు.ప్రధానంగా ఊపిరితిత్తులు, వెంట్రుకలు, ముక్కు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందన్నారు.

వీటిని నివారించేందుకు లోషన్‌తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని, చేతులకు తడి లేకుండా చూసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News