- Advertisement -
చెన్నై: తిరువణ్ణామలై కొండపై విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం చేశాడు. సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ(40) తిరువణ్ణామలైలో ఉంటూ ధ్యానం చేస్తోంది. గైడ్ సాయంతో కొండపైకి వెళ్లి ధ్యానం చేస్తుంది. మూడు రోజుల క్రితం గైడ్‌తో కలిసి కొండపైకి వెళ్లింది. ధ్యానం చేస్తుండగా ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. విదేశీ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గైడ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -