Sunday, January 19, 2025

టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

Nominations for the election of Teta Global President

నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియ
ఎన్నికల్లో సోషల్ ఒపినీయన్ స్వీకరించనున్న టెక్కీలు
రిటర్నింగ్ అధికారి అశ్విన్ చంద్ర

హైదరాబాద్: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) 2023, -26 సంవత్సరాలకు గాను నూతన గ్లోబల్ ప్రెసిడెంట్ ఎన్నికకు నేడు షెడ్యూల్ విడుదల చేసింది. టీటా నిబంధనల ప్రకారం, నాలుగేళ్ల పాటు కొనసాగే అధ్యక్ష పదవీ కాలం ఈ ఏడాది చివరలో ముగుస్తున్నందున ఈ ఎన్నికకు సంబంధించి నేటి నుంచి (గురువారం) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అశ్విన్ చంద్ర వలబోజు తెలిపారు. సోషల్ ఒపినీయన్ సైతం స్వీకరించి గ్లోబల్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఆయన వివరించారు. నేటి నుంచి (సెప్టెంబర్ 23) నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుండగా, 25వ తేదీ తుదిగడువు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణను సెప్టెంబర్ 26వ తేదీన నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన పోలింగ్ ప్రక్రియ, అధ్యక్ష ఎన్నిక కోసం సోషల్, పబ్లిక్ ఒపినియన్ ప్రక్రియ చేపడతారు. అనంతరం సెప్టెంబర్ 29న ఫలితాలు విడుదల చేయనున్నారు.

2010లో టీటా ప్రారంభం
తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్ర సాధనలో తమ పాత్ర పోషించాలన్న ఉద్ధేశ్యంతో ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సందీప్ కుమార్ మఖ్తల 2010లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)ను ప్రారంభించారు. 2013లో అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న టీటా, సెప్టెంబర్ 2014 నుంచి ప్రతి నాలుగేళ్ల కాలానికి గ్లోబల్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటుంది. ఈ నేపథ్యంలో 2018లో ఎన్నిక జరగగా సందీప్ కుమార్ మఖ్తల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సందీప్ మఖ్తల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో టీటా ఒప్పందం కుదుర్చుకొని ఐటీ ఉద్యోగులు, పరిశ్రమ కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించింది. దీంతో పాటుగా ప్రజలకు మేలు చేసే పలు టెక్నాలజీ ఆధారిత చర్యలు చేపట్టింది. ఈ కృషి ఫలితంగా వరుసగా మూడు సంవత్సరాల పాటు ఉత్తమ సంస్థ అవార్డును తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. దీంతోపాటుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం టీటా సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News