Sunday, January 19, 2025

దిల్‌సుఖ్‌నగర్ లో తనిష్క్ జ్యువెలరీ షోరూం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ లో తనిష్క్ జ్యువెలరీ షోరూంను టైటాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సి.కె వెంకటరమన్ ప్రారంభించారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు, నాణ్యమైన సేవలను అందిస్తూ, విభిన్న రకాల బంగారు ఆభరణాలు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమన్ మాట్లాడుతూ.. టైటాన్ కంపెనీ ఇప్పుడు భారీ స్థాయిలో నగర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా 109 షోరూలను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సంవత్సరంలో మరో 28 నూతన స్టోర్లను ప్రారంభోత్సవానికి ప్రణాళిక రూపొందించామని సి.కె వెంకటరమన్ తెలిపారు. ప్రపంచ శ్రేణి షాపింగ్ అనుభవాలను వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

TITAN MD Venkataraman launches Tanishq Jewellery showroom

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News