Saturday, January 11, 2025

లార్డ్ ఆఫ్ రింగ్ కింగ్ బెర్నార్డ్ మృతి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ హాలీవుడ్ నటుడు , ఇంగ్లీషు దిగ్గజ యాక్టర్ బెర్నార్డ్ హిల్ కన్నుమూశారు. టైటానిక్, ది లార్డ్ ఆఫ్‌ది రింగ్స్ సినిమాలలో ఆయన ప్రముఖ పాత్రల్లో నటించారు. ఆయన తమ 79వ ఏట మృతి చెందారని ఆయనతో పాటు పలు సినిమాలలో నటించిన బార్బారా డిక్సన్ సామాజిక మాధ్యమంలో తెలిపారు. లార్డ్ ఆఫ్ రింగ్స్ సినిమాలో ఆయన కింగ్ థియోడెన్ పాత్రలో నటించారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకుంది.

పాత్రలు ప్రత్యేకించి చారిత్రక నేపథ్యపు పాత్రలలో నటించి రాణించి జీవించిన నటుడుగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందారు. ఆయన ఆదివారం ఉదయం చనిపోయినట్లు ఆయన ప్రతినిధి కౌల్సన్ నిర్థారిచారు. టైటానిక్ సినిమాలో ఆయన క్యాప్టెన్ ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్‌గా నటించారు. మాంచెస్టర్ వాసి అయిన హిల్ టీవీ స్క్రీన్‌పై కూడా తొలిసారి ప్రవేశించారు. బిబిసిలో ఆయన నటించే సీరియల్ ఆదివారం నుంచే రిలే కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News