Monday, December 23, 2024

సముద్ర అగాధంలో టైటాన్ మునక..గాలిలో ప్రాణాలు

- Advertisement -
- Advertisement -

బోస్టన్ : 1912 నాటి టైటానిక్ నౌకశకలాలను చూసేందుకు టైటాన్ మినీ జలాంతర్గామిలో వెళ్లిన ఐదుగురు సాహసికులు సముద్ర గర్భంలో విషాదాంతం చెందారు. నార్త్ అట్లాంటిక్ సముద్రంలో 13000 అడుగుల లోతున పడ్డ శకలాల టైటానిక్ ఓ అందమైన ప్రేమ సినిమా కథను కూడా ముందుంచి మునకేసింది. ఈ టైటానిక్ శకలాలకు 1600 అడుగుల దూరంలో టైటాన్ ఈ వారం ఆరంభంలో మునిగిపోయింది. ఈ సబ్‌మెరైన్‌లో ఓ టైటానిక్ నిపుణుడు, ఓ సాహిసికుడు , ఓ కంపెనీ సిఇఒ, పాకిస్థాన్‌కు చెందిన అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన తండ్రి కొడుకు మృతి చెందారు. ఈ సబ్‌మెరైన్ ఆనవాళ్లను ఇప్పుడు గుర్తించామని అమెరికా తీర రక్షణ దళం తెలిపింది. ఈ సముద్ర అగాథపు ప్రమాదంలో అంతా చనిపోయినట్లే అని, ఎవరూ జీవించి లేరని కోస్ట్ గార్డు అధికారి రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు.

గురువారం తాము ప్రయోగించిన ఓ సముద్ర రోబో ఈ సబ్‌మెరైన్ శకలాలను పసికట్టిందని వివరించారు. ఇవి అప్పటి టైటానిక్ నౌక పతనం జరిగిన ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించారు. సాహిసకులు వెళ్లిన జలాంతర్గామి అత్యంత ప్రమాదకరమైన సముద్ర గర్భంలోకి వెళ్లడం వల్ల దీని ప్రెజర్ ఛాంబర్ పూర్తిగా దెబ్బతింది . సాధారణంగా సముద్రంలో పలు ఆటుపోట్లు ఉంటాయి. ఈ క్రమంలో సబ్‌మెరైన్‌లపై తీవ్రస్థాయి ఒత్తిడి తలెత్తుతుంది. దెబ్బతిన్న ప్రెజర్ ఛాంబర్‌లోలోపాలు ఏర్పడటంతో ఇది తట్టుకోలేక కుప్పకూలింది. నీటిలో లోతుకు వెళ్లుతున్న కొద్ది పీడనం తీవ్రంగా ఉంటుంది. ఈ దశలో తలెత్తే తీవ్ర ఒత్తిడితో సబ్‌మెరైన్‌లో ఎటువంటి లోపం ఉన్నా అది భారీ స్థాయి ముప్పు తెచ్చిపెడుతుంది. టైటానిక్ శకలాలు ఉన్న చోటును సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన మిడ్‌నైట్ జోన్‌గా వ్యవహరిస్తారు.

లోతును బట్టి వీటిని ఖరారు చేస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు కూడా కేవలం 4 సెంటీగ్రేడ్‌లుగా ఉంటాయి. చదరపు అంగుళానికి 2700 కిలోల పీడనం పడుతుంది. ఈ దశలో సబ్‌మెరైన్‌లో తలెత్తిన చిన్నపాటిలోపం ప్రమాదానికి దారితీసింది. గంటకు 1500 కిలోమీటర్ల వేగంతో వెళ్లుతున్న ఈ సముద్ర అంతర్గామి లోపల ఉన్న వారికి ఏం జరుగుతున్నదో తెలియడానికి ముందే వీరి ప్రాణాలు గాలిలో కలిసి పోయి ఉంటాయని అమెరికా కోస్ట్‌గార్డు అధికారులు తెలిపారు. టైటాన్ సబ్‌మెరైన్‌లో సాగిన ఈ సాహసాన్ని ఓసియన్ గేట్ నిర్వహిచింది. టైటానిక్ శకలాల సందర్శనకు వెళ్లే సాహసికులను తీసుకువెళ్లే క్రమంలో ఇది ఓసియన్ గేట్‌కు మూడవ సాహసయాత్ర. ఇప్పుడు జలసమాధి చెంది చరిత్రలో నిలిచిన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
స్టాక్‌టన్ రష్ ఏరోస్పేస్ దిట్ట
ఏరోస్పేస్ , టెక్నాలజీ విజ్ఞడైన రష్ 2009లో ఓసియన్ గేట్‌ను స్థాపించారు. సముద్ర గర్భంలోని వింతలు విశేషాలను చూపించడం, పరిశోధకులకు తోడ్పాటు అందించడం ఈ సంస్థ ప్రధాన ఆలోచన. రష్ ఈ టైటాన్ పైలట్‌గా ఉన్నారు. వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ పలు సార్లు సాహసికులను తీసుకుని సముద్ర షైర్‌కు వెళ్లింది. గత ఏడాది ఆయన సిబిఎస్‌కు ఇంటర్వూ ఇచ్చారు. తమ జలాంతర్గామి సురక్షితం అన్నారు. ఇది దుస్సాహాసం కాదని, సాహసమే అని తెలిపారు. అయితే రిస్క్‌లేకుంటే ఇక ఏది లేనట్లే అన్నారు.
ప్రమాదంలో చనిపోయిన హమీష్ హార్డింగ్
బ్రిటిష్ వ్యాపారవేత్త అయిన హార్డింగ్ దుబాయ్‌లో ఉంటారు. సాహస వైమానిక ప్రమాణాలు అంటే ఇష్టం. ఎయిర్‌క్రాఫ్ట్ బ్రోకరింగ్ కంపెనీ కూడా ఉంది. దీనికి ఆయన ఛైర్మన్, తాను సాహస ప్రయాణాలకు వెళ్లడమే కాకుండా ఈ దిశలో వచ్చే వారిని కూడా తీసుకువెళ్లుతుంటానని ఇంతకు ముందు తెలిపారు. సముద్ర అంతర్భాగంలో ఓ నౌకలక్ష అతి ఎక్కువ కాలం ఉండి మూడుసార్లు గిన్నీస్‌లోకి చేరారు. బిలియనర్ సాహసికుడు అయ్యారు.
పాక్ బిలియనీరు తండ్రికొడుకులు
పాకిస్థాన్‌కు చెందిన అత్యంత సంపన్న కుటుంబానినికి చెందిన తండ్రికొడుకు ఈ సబ్‌మెరైన్ ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఉన్నారు. తండ్రి షహజాదా , కుమారుడు సులేమాన్ దావూద్ చనిపోయినట్లు ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల వివరణలతో స్పష్టం అయింది. దావూద్ హెర్కులస్ కార్ప్ పేరిట వీరి సంస్థ సాగుతోంది. పాల్ హెన్నీ నార్గోలెట్ కూడా ఈ విషాదాంతపు జాబితాలో చేరారు. నార్గోలెట్ ఫ్రాన్స్‌కు చెందిన మాజీ నౌకాదళాధికారి. పలుసార్లు టైటానిక్ శకలాల సందర్శనకు తాను వెళ్లడం ఇతరులను తీసుకుని వెళ్లడం ద్వారా టైటానిక్ ఎక్స్‌పర్ట్‌గా పేరొందారు. అండర్‌వాటర్ రిసర్చ్ సంస్థకు , ఆర్‌ఎంఎస్ టైటానిక్ సంస్థకు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.
..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News