Sunday, December 22, 2024

జూన్ 4న సూర్యాపేటలో టిజెఎస్ 3వ ప్లీనరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జూన్ 4న సూర్యాపేటలో తెలంగాణ జన సమితి (టిజెఎస్) మూడవ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. కరోనా కారణంగా రెండు ప్లీనరీలు జరుగుపుకోలేక పోయామని ఆయనన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్లీనరీ పోస్టర్, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ తమ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణ జలాల కోసం పోరాటం చేశామని, ఢిల్లీలో మౌన దీక్ష నిర్వహించామన్నారు. మంత్రులకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. పేపర్ లీకేజి వ్యవహారం మీద పోరాటం చేసినట్లు తెలపారు. ఎన్నికల ఏడాది అయినందున భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడుతామన్నారు.

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలని, రైతులకు రుణమాఫీ చేయాలని. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నేటి పాలకుల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయితీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగుల ను సంఘటితం చేస్తామని. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తామని కోదండరామ్ చెప్పారు. తెలంగాణ జన సమితి మూడవ ప్లీనరీ కి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమ కారుల ఆకాంక్షల కోసం పోరాటం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News