Thursday, January 16, 2025

సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా టిఎం కృష్ణను గుర్తించరాదు: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

కర్నాటక సంగీత విద్వాంసులు టిఎం కృష్ణను మధ్యంతర చర్యగా ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా గుర్తించరాదని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. సుబ్బులక్ష్మి మనవడు వి శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు హృషీకేశ్ రాయ్, ఎస్‌విఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఆ ఉత్తర్వు జారీ చేసింది. దివంగత సంగీత విదుషీమణిపై అపఖ్యాతి కలిగించే వ్యాఖ్యలను టిఎం కృష్ణ చేశారని శ్రీనివాసన్ ఆరోపించారు. ఎంఎస్ సుబ్బులక్ష్మిపై దశదిశలా సంగీత ప్రేమికులకు ఎంతటి గౌరవాభిమానాలు ఉన్నాయో కోర్టుకు తెలుసు. ఆమె అత్యంత విశిష్ట గాయనీమణుల్లో ఒకరు, ఆమె 2004 డిసెంబర్‌లో పరమపదించినా ఆమె సుమధుర గాత్రం అమె అభిమానులకు ఎంతో ఆనందం కలిగిస్తూనే ఉంటుంది’ అని బెంచ్ పేర్కొన్నది.

‘అవార్డును ఇప్పటికే ప్రకటించినందున మధ్యంతర చర్యగా నాలుగవ ప్రతివాద టిఎం కృష్ణను ఎంఎస్ సుబ్బులక్ష్మిఅవార్డు గ్రహీతగా గుర్తించరాదనడం సముచితమని మేము భావిస్తున్నాం’ అని బెంచ్ తెలిపింది. బెంచ్ కృష్ణకు, మ్యూజిక్ అకాడమీకి, ది హిందుకు, టిహెచ్‌జి పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీస్ జారీ చేసి, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. సుబ్బులక్ష్మిని కించపరుస్తూ కృష్ణ వ్యాసాలు రాసినందున ఇది అసాధారణ వ్యవహారమని అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరామన్ పేర్కొన్న అనంతరం బెంచ్ ఆ ఉత్తర్వు జారీ చేసింది. సంగీత కళానిధి ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డును కృష్ణకు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సుబ్బులక్ష్మి మనవడు శ్రీనివాసన్ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News