Wednesday, January 22, 2025

పార్లమెంట్ ప్రారంభోత్సవ బహిష్కరణ టిఎంసితో పాటు ఆప్ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమత బెనర్జీకి చెందిన టిఎంసి, కేజ్రీవాల్ పార్టీ ఆప్‌లు హాజరుకావడం లేదు. ఈ నెల 28న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు ఏర్పాట్లు జరిగాయి. తాము ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు తొలుత టిఎంసి తెలిపింది. దీనిని అనుసరిస్తూ ఆప్ కూడా ఇదే నిర్ణయానికి వచ్చింది. భారతీయ ప్రజాస్వామ్యానికి పునాది అయిన పార్లమెంట్ పలు విలువలు, పద్ధతులకు ప్రతీక. అయితే వీటిని ఆచరించే స్థితిలో ప్రధాని మోడీ లేరని, ఆయన ఆధ్వర్యంలో జరిగే ప్రారంభోత్సవానికి తాము వెళ్లడం లేదని టిఎంసి, ఆప్ తరఫున ప్రకటనలు వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News