Thursday, January 23, 2025

బెంగాల్ నుంచి రాజ్యసభకు టిఎంసి అభ్యర్థుల ప్రకటన

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు జరగనున్న ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) జర్నలిస్ట్ సాగరికా ఘోష్, పార్టీ నాయకురాలు సుస్మితా దేవ్, మరి ఇద్దరి పేర్లను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభలోని ఐదు స్థానాలకు ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ‘సాగరికా ఘోష్, సుస్మితా దేవ్, మహ్మద్ నదీముల్ హక్, మమతా బాల ఠాకూర్ అభ్యర్థిత్వాల ప్రకటనకు హర్షిస్తున్నాం’ అని టిఎంసి ‘ఎక్స్’లో తెలియజేసింది. రెండు సార్లు రాజ్యసభ ఎంపి అయిన నదీముల్ హక్ తిరిగి పోటీ చేస్తుండగా, ముగ్గురు సిట్టింగ్ ఎంపిలు సుభాసీశ్ చక్రవర్తి, అబీర్ బిశ్వాస్,

శంతను సేన్‌లను తిరిగి నామినేట్ చేయరాదన్న నిర్ణయం పార్టీ వ్యూహంలో గణనీయమైన మార్పును సూచిస్తున్నది. కాగా, ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ ఇంకా అధికారికంగా టిఎంసిలో చేరలేదు. బెంగాల్ అసెంబ్లీలో పార్టీల బలాబలాల దృష్టా టిఎంసి నాలుగు స్థానాలను, బిజెపి ఒక స్థానాన్ని పొందగలవు. 294 మంది సభ్యులు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో 217మంది సభ్యులతో టిఎంసి నాలుగు స్థానాలను సునాయాసంగా దక్కించుకోగలదు. బిజెపి నుంచి ఫిరాయించిన ఆరుగురు ఎంఎల్‌ఎల మద్దతు కూడా టిఎంసికి ఉన్నది. ఇక అసెంబ్లీలో బిజెపి బలం అధికారికంగా 74. కాని ఫిరాయింపుల వల్ల అనధికారికంగా పార్టీ బలం 68కి తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News