Monday, December 23, 2024

TV9ని బ్యాన్ చేసిన మమతా బెనర్జీ..

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మమత బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి పార్టీ పలు మీడియా సంస్థలపై బాయ్ కాట్ చేసింది. బెంగాల్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ.. మూడు ఛానెళ్లు TV9, ABP ఆనంద, రిపబ్లిక్ లను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఛానళ్లకు అధికార ప్రతినిధులను పంపొద్దని అధికార పార్టీ టిఎంసి నిర్ణయించుకుంది. ఆయా ఛానళ్ల ప్రమోటర్లపై దర్యాప్తులు, ఈడీ కేసులు, ఢిల్లీ జమీందార్లను సంతోషపెట్టాల్సిన అవసరాన్ని గుర్తించామని తెలిపింది.

కాగా.. డాక్టర్ అత్యాచారం, హత్య కేసు సీబిఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడితోపాటు మరో ఐదుగురిని విచారించిన సిబిఐ అధికారులు.. వారికి లై డిటెక్టర్ టెస్టు కూడా నిర్వహించారు. ఓ వైపు దర్యాప్తు జరుగుతున్నా.. మరోవైపు వైద్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News