Monday, December 23, 2024

ఈసి నిర్ణయాన్ని సవాలుచేసేందుకు సిద్ధమవుతున్న టిఎంసి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌కు జాతీయ పార్టీ హోదా పోయాక, ఆ పార్టీ ఎన్నికల సంఘం(ఈసి) నిర్ణయాన్ని సవాలు చేసేందుకు ఐచ్ఛికాలను(ఆప్షన్స్) వెతుకుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సంఘం సోమవారం తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి), భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ల జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించింది.
‘ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలుచేయడానికి పార్టీ న్యాయపరమైన ఐచ్ఛికాలను వెతుకుతోంది’ అని టిఎంసి వర్గాలు సోమవారం తెలిపాయి. అయితే మమతా బేనర్జి నేతృత్వం వహిస్తున్న టిఎంసి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలావుండగా పశ్చిమబెంగాల్‌కు చెందిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ తన ట్వీట్ ద్వారా టిఎంసిని ఎద్దేవ చేసే ప్రయత్నంచేశారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి తన స్వంత పార్టీని స్థాపించుకున్నారు. దాంతో 1998 జనవరి 1న తృణమూల్ పార్టీ ఏర్పడింది. ఆమె ప్రయత్నాలు 2001, 2006లో ఫలించలేదు. కానీ 2011లో ఆమె లెఫ్ట్ ఫ్రంట్‌ను ఓడించి అధికారంలోకి వచ్చారు. ఇటీవలి కాలంలో టిఎంసి దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి నేరుగా ఛాలెంజ్ చేయాలనుకుంటోంది. అయితే ఆ పార్టీ ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ప్రస్తుతానికైతే బిజెపి, కాంగ్రెస్, సిపిఐ(ఎం), బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్‌పి), నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పిపి), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాత్రమే జాతీయ పార్టీలు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News