Sunday, January 19, 2025

అమిత్ షాపై టిఎంసి హక్కుల నోటీస్

- Advertisement -
- Advertisement -

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు గాను మంత్రిపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రాజ్యసభ నేత డెరెక్ ఓబ్రియన్ బుధవారం సభా హక్కుల నోటీస్ ఇచ్చారని ఒక ప్రతినిధి తెలినారు. రాజ్యసభ కార్యకలాపాల ప్రవర్తన నిబంధనావళిలోని 187 నిబంధన కింద నోటీస్ దాఖలు చేసినట్లు ఆ ప్రతినిధి తెలియజేశారు. రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా ఒక చర్చకు తన సమాధానంలో హోమ్ శాఖ మంత్రి మంగళవారం ఎగువ సభలో చేసిన ప్రకటనను కూడా నోటీస్ ఉటంకించింది. అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించడం పట్ల కాంగ్రెస్, కొన్ని ఇతర ప్రతిపక్షాలు లోక్‌సభ, రాజ్యసభలలో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశాయి. దీనితో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. బిఆర్ అంబేద్కర్ పేరును పదే పదే ప్రస్తావిస్తున్నందుకు కాంగ్రెస్‌ను అమిత్ షా విమర్శిస్తూ, వారు అన్ని సార్లు భగవంతుని పేరు తలిస్తే స్వర్గంలో స్థానం దక్కించుకుని ఉండేవారని వ్యాఖ్యానించారు.

‘అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని అనడం ఫ్యాషన్ అయింది. వారు అలా అన్ని సార్లు భగవంతుని నామం జపిస్తే స్వర్గంలో చోటు పొంది ఉండేవారు’ అని అమిత్ షా అన్నారు. అంబేద్కర్ పేరురు కాంగ్రెస్ ప్రస్తావిస్తుండడం పట్ల బిజెపి ఆనందంగా ఉందని, అయితే, ఆయన పట్ల తమ అసలు మనోభావాల గురించి కూడా ఆ పార్టీ మాట్లాడాలని అమిత్ షా పేర్కొన్నారు. 370 అధికరణంతో సహా అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విధానాలతో తాను ఏకీభవించడం లేదని అంటూ అంబేద్కర్ ఎలా తొలి క్యాబినెట్‌లో నుంచి రాజీనామా చేశారో అమిత్ షా వివరించారు. అంబేద్కర్ స్మారకచిహ్నాల్లో చాలా వరకు బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మించినవేనని కూడా హోమ్ శాఖ మంత్రి చెప్పారు. ‘మీరు వ్యతిరేకిస్తుండే వ్యక్తి పేరును వోట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించడం మీకు ఎలా సముచితం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను అమిత్ షా ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News