- Advertisement -
టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసి) తరపున లోక్ సభ ఎన్నికల్లో పఠాన్ ను బరిలోకి దింపుతున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్న 42 మంది తమ అభ్యర్థులను ఆదివారం టిఎంసి ప్రకటించింది.
ఇందులో యూసుఫ్ పఠాన్ కూడా ఉన్నారు. ఆయన బెర్హంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపిగా పోటీ చేయనున్నారు. ఇక, పార్లమెంట్ నుండి బహిష్కరించిన మహువా మొయిత్రాకు మరోసారి టికెట్ ఇచ్చారు. ఆమెను మళ్ళీ కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి బరిలో దింపుతున్నారు.
- Advertisement -