Saturday, December 21, 2024

టీచర్స్ స్కామ్ కేసులో టిఎంసి అభి‘షేక్’

- Advertisement -
- Advertisement -

కొల్‌కతా : టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ గురువారం ఇడి ఎదుట హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ జాబ్స్ స్కామ్ విషయంలో ఇప్పటి దర్యాప్తు నేపథ్యంలో ఆయన స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నలకు సమాధానంగా తమ వివరణ ఇచ్చారు. దాదాపుగా 6000 పేజీల వివరణాత్మక సమాదానాన్ని ఈ ఎంపి తగు డాక్యుమెంట్లతో కలిపి సమర్పించారు. ఇడి కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తునకు తాము సహకరిస్తామని , ఎటువంటి విచారణను అయినా తగు విధంగా ఎదుర్కొంటామని తెలిపారు. సాల్ట్‌లేక్ లోని సిజిఒ కాంప్లెక్స్‌లో ఉన్న ఇడి కార్యాలయానికి టిఎంసి నేత ఉదయం 11.10 గంటలకు వచ్చారు.గంటకు పైగా ఉన్నారు. అయితే ఇడి ఆయనను విచారించలేదని వెల్లడైంది. కేవలం ఆయన ఇచ్చిన సమాధానాలు స్వీకరించి ముగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News