Wednesday, January 22, 2025

అభిషేక్ బెనర్జీ మైనర్ కుమార్తెకు రేప్ బెదిరింపు

- Advertisement -
- Advertisement -

ఆర్‌జి కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఒక పిజి ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసన తెలియచేస్తూ జరిగిన ఒక ర్యాలీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి అభిషేక్ బెనర్జీ మైనర్ కుమార్తెకు వ్యతిరేకంగా వచ్చిన బెదిరింపులను పశ్చిమ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా పరగిణిస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను కమిషన్ సుమోటోగా పరిగణనలోకి తీసుకుంది. నిరసన సందర్భంగా అభిషేక్ బెనర్జీ 11 ఏళ్ల కుమార్తెపై అతాచారానికి పాల్పడాలని, ఆ పని చేసిన వారికి రూ 10 కోట్లు బహుమానంగా ఇస్తానంటూ ఒక వ్యక్తి ఆ వీడియోలో చెప్పడాన్ని కమిషన్ తీవ్రంగా ఖండించింది.

ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడాలంటూ బహిరంగంగా ఒక వ్యక్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఆ వ్యక్తి నీచ మనస్తత్వాన్ని బయటపెడుతోందని, ఇది బాలికల రక్షణకు, భద్రతకు ముప్పు కలిగించేదని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఐయాలికల హక్కులపై ఐక్య రాజ్య సమితికి నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కమిషన్ పోలీసులను ఆదేశించింది. తీసుకున్న చర్యలపై రెండు రోజులలో తమకు నివేదిక సమర్పించాలని కూడా పోలీసులను కమిషన్ ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News