- Advertisement -
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపి డెరెక్ ఒబ్రెయిన్‌పై రాజ్యసభ గురువారం సస్పెండ్ వేటు వేసింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ఆదేశాలను ధిక్కరించడంతో పాటు దుష్ప్రవర్తన కారణంగా శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు ఆయన సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ చేసినా.. రాజ్యసభలోనే డెరిక్ ఒబ్రెయిన్ కూర్చున్నారు. ఒబ్రెయిన్ సభ నుంచి వెళ్లిపోవాలని రాజ్యసభ ఛైర్మన్ ఆదేశించారు. రాజ్యసభ ఛైర్మన్ ఆదేశాన్ని టిఎంసి ఎంపి బేఖాతరు చేశారు. ఒబ్రెయిన్ కారణంగా సభను రాజ్యసభ ఛైర్మన్ రెండు సార్లు వాయిదా వేశారు. భద్రతా ఉల్లంఘన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ టిఎంసి ఎంపి ప్రతిపక్ష సభ్యులతో కలిసి నినాదాలు చేశారు.
- Advertisement -