Monday, December 23, 2024

టిఎంసి ఎంపీకి చిర్రెత్తిందంతే… సీసా పగలగొట్టి… గాయపడ్డాడు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంది. వాదోపవాదాలు తీవ్రం అయినప్పుడు టిఎంసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చిర్రెత్తిపోయాడు. బిజెపి నేత అభిజిత్ గంగోపాధ్యాయ తో వాదోపవాదానికి దిగినప్పుడు తిక్కరేగిందంతే…ఫటేల్ మని నీళ్ల సీసా పగులగొట్టేశాడు.

ఈ సందర్భంగా ఆయన బొటన వేలు, చూపుడు వేలు కు గాయమైంది. వెంటనే ఆయనకి ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ సమావేశ గదికి తోడుగా ఉండి తిరిగి తీసుకొచ్చారు. ఆయన పరిస్థితి చూసి అధికారులు కూడా సూప్ ఇచ్చారు.

బిజెపి కి చెందిన జగదంబిక పాల్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయన రిటైర్డ్ జడ్జీలు, న్యాయవాదుల గ్రూప్ అభిప్రాయాలు వింటుండగా, ప్రతిపక్ష సభ్యులు ‘‘బిల్లులో మీ స్టేక్ ఏమిటి?’’ అని నిలదీశారు. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ దుందుడుకు ప్రవర్తన చూసి ఆయన్ని పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ఒక్క రోజు కోసం సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.

Broke Bottle

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News