Saturday, September 21, 2024

సాయంత్రం 6కు కంచాలు మోగించండి: స్మృతిపై మహువా వ్యంగ్యాస్త్రం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం, ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేసిన సంపన్న పెట్టుబడిదారుడు జార్జి సొరోస్‌కు గట్టిగా జవాబు ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరాని ప్రజలకు పిలువు ఇవ్వడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్ర ఎద్దేవా చేశారు. జార్జి సొరోస్‌కు ప్రతి ఒక్క భారతీయుడు గుణపాఠం చెప్పాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు..నేటి సాయంత్రం సరిగ్గా 6 గంటలకు మీ పళ్లాలను మోగించండి అంటూ మొయిత్రా ట్వీట్ చేశారు.

భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలు ఇటీవల స్టాక్ మార్కెట్‌లో ఘోరంగా నష్టపోయిన ఫలితంగా తలెత్తిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ జవాబు చెప్పాలని సంపన్న పెట్టుబడిదారుడు జార్జి సొరోస్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని స్పందిస్తూ భారత ప్రజాస్వామిక ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే విదేశీ శక్తులకు వ్యతిరేకంగా భారతీయులంతా ఏకంకావాలని పిలుపునిచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను కొల్లగొట్టిన వ్యక్తి, ఆర్థిక యుద్ధ నేరస్థుడిగా ఆ దేశం ముద్ర వేసిన వ్యక్తి జార్జి సొరోస్ అని ఆమె తెలిపారు. అలాంటి వ్యక్తి భారతీయ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడని స్మృతి ఇరాని వ్యాఖ్యానించారు. తమకు ఇష్టమైన వారిని గద్దెనెక్కించేందుకు ఇతర దేశాలలో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఇలాంటి శక్తులు పనిచేస్తుంటాయని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News