Friday, December 20, 2024

ఇండియా కూటమికి మమత బిగ్ షాక్

- Advertisement -
- Advertisement -

ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇండియా కూటమితో పొత్తు ఉండదన్నారు. సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్ తో జరిపిన చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేసి, బిజెపిని మట్టి కరిపిస్తామన్నారు.

పశ్చిమ బెంగాల్ లో మొత్తం 42 లోక్ సభ సీట్లు ఉండగా, కాంగ్రెస్ కు తృణమూల్ రెండు సీట్లు ఆఫర్ చేసింది. అయితే పదినుంచి పన్నెండు సీట్లకోసం కాంగ్రెస్ పట్టుబట్టింది. చర్చలు ముందుకు సాగకపోవడంతో ఒంటరిగానే పోటీ చేయాలని తృణమూల్ నిర్ణయించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News