న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అర్పిత ఘోష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆమోదించినట్లు రాజ్యసభ సచివాలయం తెలిపింది. తాను ఇక పార్టీ కోసం పనిచేస్తానని అర్పిత ఘోష్ తెలిపారు. ఇటీవల ముగిసిన రాజ్యసభ సమావేశాల సందర్భంగా జరిగిన ఘర్షణను పురస్కరించుకుని సస్పెండ్ అయిన ఎంపీలలో ఘోష్ కూడా ఉన్నారు. ఈ ఘర్షణలో ఎంపీలతోపాటు మార్షల్స్ కూడా గాయపడ్డారు. పార్టీ ఆదేశాల మేరకే ఆమె తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని టిఎంసి వర్గాలు తెలిపాయి. కాగా..వివిధ హోదాలలో ప్రజలకు సేవ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఆమె ఒక లేఖ రాశారు. ఇక తాను రాష్ట్రంలో ఉండి పార్టీలో చురుకైన పాత్ర పోషించాలని ఆశిస్తున్నానని, అందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆమె తన లేఖలో కోరారు.
టిఎంసి రాజ్యసభ సభ్యురాలు అర్పిత ఘోష్ రాజీనామా
- Advertisement -
- Advertisement -
- Advertisement -