Monday, December 23, 2024

ఎంపి మహువాపై ఆరోపణలు.. టిఎంసి స్పందన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టిఎంసి ఎంపి మహువా మొయిత్రీపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంట్ నైతిక కమిటీ దర్యాప్తు చేయనివ్వండని టిఎంసి మరో ఎంపి డెరిక్ ఓబ్రెయిన్ ఆదివారం వ్యాఖ్యానించారు. అదానీ గ్రూపును, ప్రధాని మోడీని లక్షంగా చేసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ టిఎంసి ఎంపి మహువా మొయిత్రీపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించడం రాజకీయంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

ఈ ఆరోపణలపై టిఎంసి ఏమాత్రం స్పందించకుండా మౌనం వహిస్తోందని బీజేపీ ధ్వజమెత్తడంపై టిఎంసి ఎంపి డెరిక్ ఓ బ్రెయిన్ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ కమిటీ దర్యాప్తు పూర్తయిన తరువాత తమ పార్టీ టిఎంసి తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాలను తాము గమనించామని, తమపై వచ్చిన ఆరోపణలకు స్పష్టం చేయాలని పార్టీ మహువాకు సూచించగా ఆమె అదే చేశారని డెరిక్ ఓబ్రెయిన్ పేర్కొన్నారు. ఏదేమైనా ఈ అంశం దర్యాప్తులో ఉంది కాబట్టి దర్యాప్తును చేయనివ్వండని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News