Sunday, January 19, 2025

కునాల్ ఘోష్‌కు టిఎంసి షాక్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కునాల్ ఘోష్ ను తొలగించింది. పార్టీ వైఖరికి అనుగుణంగా ఘోష్ అభిప్రాయాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిఎంసీ అధికారిక ప్రకటనలో తెలియజేసింది.

దీనిపై పార్టీ సీనియర్‌నేత డెరెక్ ఒబ్రెయిన్ సంతకం చేశారు. ఇంతకు ముందు ఘోష్‌ను అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించిన పార్టీ అధిష్ఠానం తాజాగా ఆయనను ప్రధాన కార్యదర్శి పదవిని కూడా తొలగించింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తపస్‌రాయ్‌పై ఘోష్ బుధవారం బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. తపస్‌రాయ్ పార్టీ మారడం సరైందేనని, తమ పార్టీ తృణమూల్ కాంగ్రెసే సరైన దిశలో వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తృణమూల్ అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతోఘోష్ పదవి కోల్పోవాల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News