చెన్నై: జర్నలిస్టు కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం కోవిడ్-19 పరిహారం ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తామని ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ ప్రకటించారు. ఇప్పటికే తమిళనాట జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సిఎం స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడులో కరోనా బారినపడిన జర్నలిస్టులకు రూ.5,000 ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తున్నారు. గత పాలనలో జర్నలిస్టులకు ఇచ్చిన ప్రోత్సాహం 3,000 రూపాయలు. దీన్ని పెంచాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న తరువాత రూ. 3,000 నుండి రూ. 5,000లకు పెంచామన్నారు. గత పాలనలో, మీడియాలో పనిచేస్తున్న ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు, కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు ప్రభుత్వం రూ .5 లక్షల పరిహారం లభించేది.
TN Govt Announces 10 Lakh compensation for journalists