Wednesday, January 22, 2025

తమిళనాడు నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం

- Advertisement -
- Advertisement -

చెన్నై : ఒడిశాలో రైళ్ల ప్రమాదంలో సహాయ కార్యక్రమాల్లో సమన్వయం కోసం తమిళనాడు నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఒడిశాకు బయలు దేరింది. అక్కడ చిక్కుకుపోయిన, గాయపడిన తమిళనాడుకు చెందిన ప్రయాణికులను తీసుకురాడానికి రాష్ట్ర మంత్రులు, అధికారులతో కూడిన ప్రతినిధి బృందం బయలుదేరిందని ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. ఒడిశా లోని భద్రక్ నుంచి 250 మంది ప్రయాణికులను స్పెషల్ రైలు ద్వారా చెన్నైకు తీసుకువస్తున్నారు. వీరు ఆదివారం ఉదయం సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటారు.

తమిళనాడుకు చెందిన 55 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరు షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉండగా ప్రమాదం జరిగింది. బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు కూడా తమిళనాడుకు తీసుకువస్తున్నారు. ఎజెలిగమ్, చెపక్ వద్ద ఏర్పాటైన కంట్రోల్ రూమ్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం సందర్శించారు. మంత్రులు ఉదయనిధి స్టాలిన్ , ఎస్‌ఎస్ శివశంకర్, రెవెన్యూ, రవాణా విభాగాల సెక్రటరీలు, ఒడిశాకు బయలుదేరి వెళ్లారు. అడిషనల్ డిజిపి సందీప్ మిట్టల్ నేతృత్వంలో రిస్కు టీం ఒడిశాకు బయలుదేరి వెళ్లిందని స్టాలిన్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్‌తో తాను మాట్లాడి సంతాపం తెలియచేశానని సిఎం చెప్పారు. తమిళనాడు నుంచి పూర్తి సహాయం అందిస్తామని చెప్పానని స్టాలిన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News