Friday, November 15, 2024

తమిళనాడు మంత్రికి 14 రోజుల జుడిషియల్ రిమాండ్

- Advertisement -
- Advertisement -

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో బుధవారం తెల్లవారుజామున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు అరెస్టు చేసిన తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని జూన్ 28 వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

బుధవారం తెల్లవారుజామున సెంథిల్ బాలాజీని కస్టడీలోకి తీసుకున్న ఇడి అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద కారులో బాలాజీ భోరున విలపిస్తూ మీడియా కంటపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రివర్గంలో ఒక మంత్రిని మనీలాండరింగ్ కేసులో ఇడి అరెస్టు చేయడం ఇదే మొదటిసారి.

మంగళవారం ఆయన నివాసంలో ఇడి అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. నలతగా ఉందని చెప్పడంతో ఆయనను ఇడి అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేశారు. అనంతరం ఆయనను సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News