Monday, December 23, 2024

ఎమ్మెల్సీ ఆమేర్ అలీఖాన్‌కు అభినందనలు తెలిపిన టిఎన్జీఓ నాయకులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమతులైన సియాసత్ ఉర్దూ న్యూస్ పేపర్ ఎడిటర్ ఆమేర్ అలీ ఖాన్‌ని టిఎన్జీఓ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డా.యస్.ఏం.హుస్సేనీ (ముజీబ్) మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీ వర్గానికి చెందిన అమేర్‌ అలీ సేవలు ప్రభుత్వానికి ఎంతో అవసరమని, రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో రాష్ట్రానికి మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముజీబ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ నసీరుద్దీన్, వికాస్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News