- Advertisement -
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని రూపొందించడతో పాటు, రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసిన సిఎం కెసిఆర్ కు టీఎన్జీవో సభ్యులు మంగళవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్ఞత తెలిపారు. 50 వేల నూతన ఉద్యోగాల భర్తీ చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కెసిఆర్ తో భేటీ అయిన వారిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఎన్జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు.
TNGO members thanked CM KCR
- Advertisement -