Monday, December 23, 2024

సిఎం, మంత్రులను కలిసి అభినందనలు తెలిపిన టిఎన్జీఓ రాష్ట్ర నాయకులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టిఎన్జీఓ రాష్ట్ర నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. సచివాలయంలో టిఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అధ్వర్యంలో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డా.ఎస్.ఏం.హుస్సేనీ (ముజీబ్), కేంద్ర సంఘ నాయకులు టి.పర్వతాలు కలిసి అభినందనలు తెలియజేశారు. సిఎంతో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, జూపల్లి కృష్ణారావులను కలిసి వారు అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని యావత్ తెలంగాణ ఎన్జీఓల సంఘం పక్షాన హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నట్టు వారు తెలిపారు.
సిఎంను కలిసిన సిపిఎస్ నాయకులు
సి.ఎం రేవంత్‌రెడ్డికి సిపిఎస్ యూనియన్ తరపున ఆ సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డిని సెక్రటేరియట్‌లో కలిసిన సిపిఎస్ నాయకులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు కోటకండ పవన్ కుమార్, సాయి రాజ్‌లు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News