Monday, December 23, 2024

ఖబడ్దార్ బండి

- Advertisement -
- Advertisement -

 

టిఎన్‌జిఓ కార్యాలయానికి భారీ ర్యాలీగా
తరలిన ఎంప్లాయీస్ నల్లబ్యాడ్జీలు ధరించి
నిరసన మనోభావాలను కించపరిస్తే
సహించేది లేదంటూ హెచ్చరిక

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉద్యోగులు అమ్ముడుపోయారని.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ.. ఉద్యోగులు భారీ ర్యా లీ నిర్వహించారు. బేషరతుగా బండి సంజయ్ ఉద్యోగ సంఘాల కు క్షమాపణలు చెప్పాలని నా యకులు డిమాండ్ చేశారు. సం జయ్ వ్యాఖ్యలకు నిరసనగా నాం పల్లి టిఎన్‌జివో భవన్ వద్ద ఉద్యోగుల జెఎసి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి, బండికి వ్యతిరేకంగా నినదించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి ర్యాలీగా టిఎన్‌జిఓ భవన్‌కు భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. బండి సంజయ్ తనవ్యాఖ్యలు ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలన్నా రు. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్ మామిండ్ల రాజేందర్ మాట్లాడుతూ ఎంపి బండి సంజయ్ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఉద్యోగులు టిఆర్‌ఎస్‌కు అనుకూలమని మాట్లాడారని ఆరోపించారు. మా ఎన్నికల వివరాలు సంజయ్‌కి చెప్పాల్సిన అవసరం లేదని, తెలంగాణ ఉద్యమం చురుగ్గా ఉన్న స మయంలో బిజెపి, బండి సంజయ్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.

ఉద్యోగుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోమన్నారు. తాము ఇన్ కం టాక్స్ స్లాబ్‌ను పెంచాలని కోరామని, మరి మీరెందుకు చేయలేదని ప్రశ్నించారు. టిజివో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ ఎంపి సంజయ్ తెలంగాణ ఉద్యోగ సంఘాలను అవమానించేలా మాట్లాడారన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ 2015లో 42%, 2021లో 30% పిఆర్‌సి ఇచ్చారన్నారు. ఉద్యోగులు అడిగిన దాని కంటే ఎక్కువగానే ఇచ్చారని తెలిపారు. ఉద్యోగులు అమ్ముడుపోయారని వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని, కేంద్రాన్ని ఒప్పించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఉద్యోగ సంఘాలు.. ఉద్యోగ నాయకులపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టిఎన్‌జిఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ ఎం హుస్సేనీ (ముజీబ్) తెలిపారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం టిఎన్‌జిఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి ప్రతాప్ ఇచ్చిన పిలుపు మేరకు ముజీబ్ ఆధ్వర్యంలో వందలాది ఉద్యోగులు ర్యాలీగా కేంద్ర సంఘం కార్యాలయానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ 76 ఏళ్లుగా ఉద్యోగుల శ్రేయస్సు కోసం టిఎన్‌జిఓ నిర్విరామముగా పనిచేస్తుందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో సంఘం యొక్క పాత్రను గుర్తు తెచ్చుకోవాలని బండి సంజయ్‌కు సూచించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సిపిఎస్, ఇన్‌కమ్ టాక్స్ స్లాబుల పెంపు కోసం మాట్లాడాలని సంజయ్‌కు ఆయన సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాలపై అనుచితమైన పదజాలం ఉపయోగించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం, యూనిట్ అధ్యక్షా, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News