పంజాగుట్ట: నిజం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అన్నారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉద్యోగులు, వై ద్యులు అందరూ సమన్వయంతో కృషి చేస్తేనే అనుకున్న లక్ష్యాలను చేరుతామ ని అన్నారు. ఈనెల 14న ఆసుపత్రికి అనుసంధానంగా మరో భవనం దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారని చెప్పారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆసుపత్రిలోని కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉద్యోగులు, వైద్యుల వరకు ప్రత్యేక కృషి చేశారని, దీంతోనే అతిపెద్ద కార్యక్రమం ఎలాంటి లోటు పాట్లు లేకుండా విజయవంతంగా పూర్తయిందని అన్నారు.
ఇందులో వాలంటీర్‌గా పని చేసిన వారి సేవలను గుర్తిస్తు ఆసుపత్రిలో శనివారం కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ని డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ నిమ్స్‌లో వైద్య సేవల కోసం దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తుంటారని ఇక్కడికి వస్తున్న సిబ్బంది నిరంతరం పనిచేస్తూ వేగంగా సేవలందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మన సేవల్ని గుర్తించి ఆస్పత్రి విస్తరణ చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వేగంగా వైద్య సేవలు అందించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు ప్రభుత్వానికి మంచి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ, మెడికల్, సూపరింటెండెంట్లు , డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ లక్ష్మీ భాస్కర్ , డాక్టర్ నగేష్ , డాక్టర్ సాయిబాబా , ఉద్యోగ సంఘాలా నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.