Wednesday, January 22, 2025

పామును తరిమేందుకు పొగబెడితే…

- Advertisement -
- Advertisement -

బంద(ఉత్తర్ ప్రదేశ్): ఇంట్లో దాక్కున్న నాగుపామును బయటకు తరిమేందుకు పొగబెట్టిన ఒక కుటుంబం చివరకు ఇంటినే తగలబెట్టుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఆదివారం ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. పిడకలు కాల్చి ఆ పొగతో ఇంట్లో నుంచి పామును తరిమివేయడానికి ఆ కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే పొడకలు అంటుకోవడంతో మంటలు వ్యాపించి ఆ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని వస్తువులతోపాటు నగదు, నగలు కూడా కాలి బూడిదైపోయాయి.

ఢిల్లీలో కార్మికుడిగా పనిచేసే రాజ్‌కుమార్ తన భార్య, ఐదుగురు పిల్లలతో ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఇల్లు కాలిపోవడంతో వారు కూడబెట్టుకున్న నగదు, నగలు, క్వింటాళ్ల కొద్దీ ధాన్యం తగలబడిపోయి కట్టుబట్టలతో మిగిలారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. రెవెన్యూ సిబ్బంది చేరుకుని జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. నాగుపామును బయటకు పంపేందుకు తాము పొగ పెట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని ఒక పోలీసు అధికారి చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News