Monday, December 23, 2024

అమరుల త్యాగాలను అవహేళన చేయడమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అమరులను కించపరిచేలా మాట్లాడడం, వా రి త్యాగాలను అవహేళన చేయడమేనని రా హుల్ దుయ్యబట్టారు. తెలంగాణ అస్తిత్వా న్ని,ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని హితవు పలికారు.తెలంగాణ ప్రజలకు మోడీ క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మోడీ తెలంగాణ విరోధి : కెటిఆర్
మోడీ తెలంగాణ విరోధి.. తెలంగాణ మీద పదే పదే అక్కసు ఎందుకు ప్రధాని..? అం టూ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటుపైన పార్లమెంట్‌లో మోడీ చేసిన వ్యాఖ్యలపై న మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ను,తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏండ్ల తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాలను తక్కువ చే సి మాట్లాడే లా ప్రధానమంత్రి పదేపదే తన అక్కస్సును వెళ్లగక్కుతున్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటుపైన ప్రధానమంత్రి పార్లమెంట్ సా క్షిగా తన గుడ్డి వ్యతిరేకతను వెళ్లగక్కడం ఇప్పటికే అనేకసా ర్లు చూశామని అన్నారు. తెలంగాణ సమాజమంతా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ త్యాగాల పునాదులపైన ఏర్పడిందని, అలాంటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంబురాలు జరగలేదన్న మో డీ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికా రు. కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిప డి ఉన్న చారిత్రక అంశాల పట్ల ప్రధానమం త్రి సున్నితంగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంబరాలు జరగలేదు అనడం ప్రధానమం త్రి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం గా నిలుస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పా ర్టీని వ్యతిరేకించే ఉద్దేశంతో ప్రధానమంత్రి పదేపదే కోట్లాదిమంది తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మనోభావాలతో అడుకోవడం మానుకోవాలని,చారిత్రక అం శాల పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ, అర్థం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ప్రధాని లాంటి హోదాల్లో ఉన్న వ్యక్తులకు అత్యం త అవసరమని సూచించారు. తెలంగాణపై మోడీ వ్యాఖ్యలను ఖండించిన కెటిఅర్, మోడీ ద్రోహాలను గుర్తు చేశారు. పార్లమెంట్ అమృతకాల సమావేశాలని పేరుపెట్టి తెలంగాణపై విషం చిమ్మడం ఏ సంస్కారానికి గు ర్తని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు రాష్ట్ర పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని అన్నారు. మా దశాబ్దాల కల నెరవేరిన నాడు అంబరాన్నంటిన తెలంగాణ సంబరాలు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు కనిపించలేదా? అని సూటిగా ప్రశ్నించారు.

గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించడమేనన్నారు. గతంలో తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తారన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని మా రైతుల్ని కించపర్చిండు, మీ కేంద్రమంత్రి, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తదా..మీలాగే మీ మంత్రులు తెలంగాణ పట్ల తీవ్ర వ్యతిరేకత నింపుకున్నారన్నారు. నిధులు మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వని ప్రధాని, కనీసం మాటల్లోనైనా మర్యాద చూపించాలని మంత్రి కెటిఆర్ సూచించారు. కోటి ఆశలు, ఆకాంక్షలతో పురుడు పోసుకొన్న కొత్త రాష్ట్రానికి సహకరించక పోగా ఆదినుంచి కక్షను పెంచుకొని, ప్రధాని వివక్షనే చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఏడు మండలాలు గుంజుకొని, లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని తెలంగాణ మర్చిపొదని మంత్రి కెటిఆర్ అన్నారు.

నీతి ఆయోగ్ చెప్పినా నీతి లేకుండా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు నిధులను నిరాకరించిన కేంద్రం వైఖరి తెలంగాణ ప్రజలకు గుర్తుండిపొతుందని అన్నారు. కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కాజీపేట కోచ్ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని తెలంగాణ ఎన్నటికీ క్షమించదన్నారు. 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వకుండా గుండుసున్నా చేసారంటే, .మీకు తెలంగాణపై ఎంత కోపమో తెలుస్తోందన్నారు. పైన అప్పర్ భద్ర, కింద పోలవరం, ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయ హోదా నిచ్చి మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు చూపారో? మీ గుడ్డి వ్యతిరేకత చూస్తే అర్ధం అవుతుందని అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి, గిరిజన వర్సిటీని పక్కన పెట్టి, సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేసి, ఐటిఐఆర్‌ను రద్దు చేసి, హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ తరలించి అడుగడుగునా తెలంగాణ ప్రగతికి అడ్డంకులు కల్పించారని మంత్రి కెటిఆర్ అన్నారు. ఒక వైపు నిధులివ్వరు, సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధించిన తీరుని సైతం మంత్రి కెటిఅర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే పగతో జుమ్లా.. హమ్లాలు చేసే డబుల్ ఇంజన్ సర్కారు మీదన్నారు. సిబిఐ,ఇడి, ఐటి లాంటి వేటకుక్కలతో ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న ప్రధాని, ప్రజాస్వామ్యం గురించి సుద్దులు చెప్పడం విచిత్రం కాక మరేమిటని అన్నారు. తెలంగాణపై వ్యతిరేకత నింపుకున్న మీరు డబుల్ ఇంజన్ నినాదంతో ఊదరగొట్టినా తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని మంత్రి కెటిఆర్ అన్నారు. డిపాజిట్లు పోగొట్టు కోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అని అన్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన బిజెపికి, ఇక్కడ పుట్టగతులు ఉండవని తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఆపి, అదే పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పా లన్నారు. ద్వేషం కాదు, దేశం ముఖ్యమని, దేశం అంటే రాష్ట్రాల సమాహారం అని తెలుసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News