Wednesday, January 22, 2025

పార్టీని బలోపేతం చేసేందుకే బరిలోకి దిగా

- Advertisement -
- Advertisement -

To strengthen the Congress party:Kharge

సీనియర్లతో పాటుగా యువ నేతలు కూడా పోటీ చేయమని కోరారు
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపై మల్లికార్జున ఖర్గే స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే ఎన్నికల బరిలోకి దిగాను తప్ప ఎవరినో ఎదిరించడానికి కాదని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలో అభ్యర్థి మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అనేక మంది సీనియర్లు , యువనేతలు తనను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరినందునే తాను ఎన్నికల బరిలో నిలిచానని ఆయన చెప్పారు.‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ సిద్ధాంతాన్ని అనుసరించి నామినేషన్ వేసిన రోజునే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. ఆదివారం నాడు ఆయన దీపేందర్ హూడా, సయ్యద్ నజీర్ హుస్సేన్, గౌరవ్ వల్లభ్‌లతో కలిసి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడిని ఏకాభిప్రాయం ద్వారా ఎన్నుకోవడం కోసం పోటీనుంచి తప్పుకోవాలని తాను శశిథరూర్‌కు చెప్పానని, అయితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం తాను పోటీ చేసి తీరుతానని ఆయన చెప్పారని ఖర్గే అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నాయని, పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.

మల్లికార్జున ఖర్గే అధ్యక్ష కొనసాగింపు ,యథాతథ స్థితికిఅభ్యర్థి అయితే.. తాను మాత్రం మార్పు కోసమే పోటీ చేస్తున్నట్లు శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపైనా ఖర్గే స్పందించారు. ఎన్నికల తర్వాత సంస్కరణలపై తీసుకునే ఏ నిర్ణయమైన్సామష్టిగానే తీసుకుంటామని, ఒక వ్యక్తిగా తీసుకోమన్నారు. ఖర్గే వెనుక గాంధీ కుటుంబం ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చుతూ అనేకమంది ఇతరనేతలు తనను పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే వారి మధ్య బహిరంగ చర్చను తాను స్వాగతిస్తున్నానని, ఎందుకంటే అది పార్టీ పట్ల ప్రజల్లో అసక్తిని రేకెత్తిస్తుందని శశి థరూర్ ఒక ఇంటర్వూలో చెప్పిన విషయం గురించి విలేఖరులు ప్రశ్నించగా, ఆ వివాదంలోకి వెళ్లాలని తాను అనుకోవడం లేదని ఖర్గే చెప్పారు. ఎలా పనిచేయాలో మాత్రమే తనకు తెలుసునని ఆయన అంటూ, అందుకు తనకు ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ దీపేందర్ హూడా, సయ్యద్ నాజిర్ హుస్సేన్‌లతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే తరఫున తాము ప్రచారం చేస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News