Monday, December 23, 2024

పంటికి అంటకుండా మింగడానికే!

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అడుగుతున్న మరో అవకాశం ఇందుకే..
గతంలో రాబందులు తప్ప రైతుబంధు లేదు

ధర్మపురి, వేల్పూర్ సభల్లో కెసిఆర్

మన తెలంగాణ/వేల్పూర్/మోర్తాడ్ : ఒక్కసారి అ వకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారని, వాళ్ళ వస్తే మన గతి ఏం చేస్తారో తెలుసునని ఒక్కసారి కాదు 11 సార్లు అధికారం ఇచ్చారని కానీ ఏం చేశారో చెప్పాలని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రశ్నించారు. ఆయన గురువారం వేల్పూర్ మండల కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభలో మా ట్లాడారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మింగేస్తారన్నా రు, గతంలో ఏం జరిగిందో తామ హయాంలో ఏం జరిగిందో గుర్తించాలని కోరారు. ఎన్నికలు వచ్చాయి కదా ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతారు. ఆలోచించుకొని ఓటేయ్యాలన్నారు. కర్ణాటక ఎలా ఉందో వచ్చి చూడు కావాలంటే బస్సు పెడతా అని ఉప ముఖ్యమంత్రి నాకే సవాల్ చేస్తుండు అక్కడపోయి అయిదు గంటల కరెంటు ఎట్లా ఇస్తున్నారో చూడాలని కెసిఆర్ అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే రైతులు రెండు వేల చొప్పున జమ చేయాల్సి వచ్చేదని అది మరమ్మతులకు కావాలంటే మూడు రోజులు పట్టేది మళ్లీ ఆ రాజ్యం రావాలా దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ కావాలా ఆలోచన చేయాలన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రైవేట్ పిచ్చి పట్టిందని, అందుకే ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీంటిని ప్రైవేట్‌పరం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. వ్యవసాయ బోర్ల కు పెట్టకుంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయలను కట్ చేసిందని, అయినా తెలంగాణ ప్రభుత్వం కరెంటు మీటర్లకు మోటార్లు పెట్టలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఆచరణకు సా ధ్యం కాని హామీలను ఇస్తుందని, వారి మాటలను నమ్మకుండదని, ఒక ఓటు కూడా వేరే పార్టీకి వెళ్లకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెబుతుందని, దళితుల గురించి ఆలోచించేది తాను ఒక్కడేనని కెసిఆర్ అన్నారు. దళిత బం ధు నా మానస పుత్రిక అని, దశల వారీగా అందరికి దళిత బంధును అందరికి అందిస్తామన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె. శివకుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఐదు గంటలే కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బిజెపి అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారని, కరెంటుకు జై భీం చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. బాల్కొండలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి కన్నా ముందు చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉండేవారని, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. బాల్కొండలో 18 సబ్ స్టేషన్‌లు పెట్టించాడని, ఆయన నా పెద్ద కొడుకు లాంటోడని, మరో సారి వేములను గెలిపిస్తే పెద్ద స్థానంలో ఉంటాడని అన్నారు. ఈ కార్య ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ ఎమ్మెల్యే షకీల్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News