Thursday, December 26, 2024

గురువారం రాశి ఫలాలు(13-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వ్యాపారస్తులు మెలకువగా వ్యవహరించవలసి ఉంటుంది. సినీ, కళా సాహిత్య రంగాలలోని వారికి చేతి వృత్తి వారికి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

వృషభం – పరస్పర విరుద్ధమైన ఆలోచనలు సాగిస్తారు. శత్రుత్వాలు, పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటారు. మనో ప్రశాంతతతో వ్యవహరిస్తారు. ప్రకటనలు అనుకూలమైన ఉత్తర్వులు లాభిస్తాయి.

మిథునం – ఇష్టం లేని వ్యవహారాలను ఇష్టం లేదని నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టు తేల్చివేస్తారు. అనుకున్న కార్యక్రమాలను సకాలంలో అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు.

కర్కాటకం – దూర ప్రాంతంలో అనుకున్న విధంగా విద్యాభ్యాసం కొనసాగించడానికి గాను మీ సంతానానికి అవకాశాలు కలిసి వచ్చాయని శుభవార్తలు అందుకోగలుగుతారు. ధనం చేతికి అందివస్తుంది.

సింహం – ఆర్థికపరమైన చిక్కుల నుండి పూర్తిగా బయటపడలేకపోయినా ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. స్వల్ప ధన నష్టం వాటిల్లుతుంది.

కన్య – తల్లితండ్రుల పట్ల బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి గాను వారి పేరు మీద కొంత ధనాన్ని మదుపు చేయాలని యోచిస్తారు.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు.

తుల – ప్రయాణాలు బంధుమిత్రుల సమాగమనం వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి – ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు.

ధనుస్సు – ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. కొద్దిపాటి ధనాన్ని రుణాలుగా స్వీకరిస్తారు. అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు.ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

మకరం – సేవా కార్యక్రమాలలో పూర్తిస్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం చోటు చేసుకుంటుంది.జటిల సమస్యలకు పరిష్కారాలను సాధించగలుగుతారు.

కుంభం – ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోగలుగుతారు. అమ్మకానికి సంబంధించిన చర్చలు వాయిదా పడతాయి. మనోబలంతో ముందడుగు వేస్తారు. ఆత్మ నిబ్బరం కలిగి ఉంటారు.

మీనం – ఎదుటివారి వాదాన్ని ఆసాంతం విని మీ ప్రతిపాదనలను తెలియజెప్పండి. దీనివలన మేలు జరుగుతుంది. ఆర్థికపరమైన అంశాలు ఏ దారిన పోతున్నాయో ఊహించడం మీకు కష్ట సాధ్యమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News