- Advertisement -
న్యూఢిల్లీ: భారత దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. తమ అభిమాన జట్టు ఈసారి ఐపిఎల్ ట్రోఫీని అందుకోవాలని ఇప్పటి నుంచి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఐపిఎల్‌లో పొగాకు, మద్యం ప్రకటనలను ప్రసారం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
దేశ యువతకు ఆదర్శంగా ఉండే క్రికెట్ ఆటగాళ్లకు ఏ రకమైన పొగాకు, మద్యం ప్రకటనలతో సంబంధం ఉండకూడదని స్పష్టం చేసింది. ఐపిఎల్ జరిగే స్టేడియం ప్రాంగణాలు, జాతీయ మీడియాలో ప్రసారమయ్యే సమయంలో పొగాకు, మద్యం ప్రకటనలు ఇవ్వొద్దు అంటూ కేంద్రం పేర్కొంది. వీటి విక్రయాలపై కూడా నిషేధం ఉందని.. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
- Advertisement -