Sunday, December 22, 2024

తిరుపతి లడ్డూలో వాడిపడేసిన తంబాకు

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతికి వెళ్లి లడ్డూలు తెచ్చుకున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి ఈ నెల 19న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో బంధువులు, ఇరుగు పొరుగు వారికి లడ్డ్డూ ప్రసాదాన్ని పంచేందుకు తీసుకువచ్చారు.

లడ్డూను పంచేందుకు చిన్న చిన్న భాగాలుగా చేస్తున్న క్రమంలో లడ్డూ నుంచి వాడిపడేసిన అంబర్ (తంబాకు) ఓ పేపర్‌లో చుట్టి కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురయ్యారు. ఇప్పటికే తిరుమల లడ్డ్డూ వ్యవహారం సంచలనంగా మారిన తరుణంలో లడ్డూ ప్రసాదంలో అంబర్ బయపడడంతో కలకలం రేగింది. ఈ అంశంపై పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News