Thursday, January 23, 2025

నేడు నటుడు కృష్ణ దశ దిన కర్మ

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ నటశిఖరం సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు. తండ్రి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల మహేష్‌ బాబు పెట్టిన పోస్ట్‌ కూడా అందరి హృదయాల్ని కదిలించింది. ఇవాళ కృష్ణ దశ దిన కర్మ. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా పూర్తి చేస్తున్నారు ఘట్టమనేని కుటుంబ సభ్యులు.

ఈ రోజు ఎన్ కన్వెన్షన్ దగ్గర కార్యక్రమం జరిగే చోట కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణ 27 సంవత్సరాలు వయసులో ఎలా ఉన్నారో.. అచ్చం అలాంటి విగ్రహాన్ని తయారు చేశారు. ఏడాదిలో మహేష్ బాబు తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్యను కూడా కోల్పోవడంతో బాబు ఎంతో మనోవేదనకు గురయ్యారు.

ఒక మనిషి వెళ్ళిపోతే ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ రెంటి మేలికలయికగా సాగి ఇటీవల ముగిసిన ప్రముఖ సినిమా నటుడు కృష్ణ జీవితం తరచి చూస్తే మనవాళికే ఆదర్శనీయంగా గోచరిస్తోంది. మానవీయ విలువలతో, సామాజిక స్పృహతో, కుల మత వర్గాలకు కొమ్ముకాయకుండా, అందరివాడిగా గడచిన ఆయన బ్రతుకులో ప్రతి మలుపు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది.

నటన ద్వారా వచ్చిన కీర్తిని, ధనాన్ని చూసి పొంగిపోకుండా, పొగరు కొమ్ములు రాకుండా సినీరంగంలోనూ, సమాజంలోనూ సాటి మనిషిగా ఆయన కొనసాగిన తీరు అనితరసాధ్యమనిపిస్తుంది. నిండు పున్నమి చంద్రుణ్ణి అకస్మాత్తుగా అమావాస్య కమ్మినట్లు కృష్ణ నిర్యాణం కోట్లాది మందిని కలచివేసింది.గుండెపోటుతో ఆయన ఆసుపత్రిలో చేరినవార్త ఇంటింటికి విషాదాన్ని చేరవేసింది.ఏమవుతుందోనన్న బెంగతో ఎదురు చూసినవారికి నిరాశే మిగిలింది. కృష్ణ 15 నవంబర్ నాడు తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News