Thursday, January 23, 2025

నేడు జాతీయ రహదారులపై ఆఖిల పక్ష పార్టీల రాస్తారోకో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌పిఎస్సీ అధికారుల వైఫల్యంతో రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారని ఆఖిల పక్ష పార్టీలు ఆవేదన వ్యక్తం చేశాయి. విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్, టిజెఎస్, బిఎస్పీ, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, న్యూ డెమోక్రసీ, ప్రజా పంథా పార్టీలు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ధి సంఘాలు పాల్గొంటాయన్నారు.

ఉదయం 10.30 గంటల నుండీ 12.30 వరకు జరిగే ఈ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలందరూ విద్యార్థులకు, యువతకు మద్దతుగా పాల్గొనాలని ఆఖిల పక్ష నేతలు కోరారు. మహబూబ్‌నగర్ రహదారి, వరంగల్, ఖమ్మం రహదారులపై పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చాయి. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా టిఎస్‌పిఎస్ సభ్యులను తొలగించి ,చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి,ఎస్సీ పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా 13,500 కు పెంచాలని పేర్కొన్నారు. పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు రూ. 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News