Sunday, December 22, 2024

బుధవారం రాశి ఫలాలు (11-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం:- ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మార్కెటింగ్ చేసేవారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి.

వృషభం :- ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు.  సోదరుల నుండి ధనలాభం.

మిథునం :- విద్యార్ధులు కష్టపడి ఉత్తీర్ణత సాదించాలి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు.

కర్కాటకం :- శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. సన్నిహితులతో ఆర్ధిక లావాదేవీలు జరుపుతారు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ధనలాభం.

సింహం :- పరిచయాలు పెరుగుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కన్య:- ఋణాలు కొంత వరకు తీరుస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు. పనులు నిదానంగా సాగుతాయి.

తుల:- శుభవార్తలు అందుకొంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ముఖ్యమైన విషయ వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వృశ్చికం :- ఉద్యోగస్తులకి స్థాన చలనాలు ఉంటాయి. బంధువులతో ఏర్పడిన ఆర్ధిక పరమైన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.

ధనుస్సు:- భాగస్వామ్మ వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు.

మకరం :- ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధిక లావాదేవీలు పుంజుకుంటాయి. సంఘసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం గోచరిస్తున్నది.

కుంభం :- ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఋణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య పరంగా ఉన్న నమన్యల నుండి బయటపడతారు. స్వల్ప ధనలాభం.

మీనం :- చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి-వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు పొందుతారు. విద్యార్ధులు సంకేతిక విద్యలో రాణించడానికి ఇది అనువైన సమయం.

Saturday rasi phalalu

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News