Thursday, January 23, 2025

నేడు చెన్నైతో గుజరాత్ ఢీ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్ 2023లో భాగంగా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌-చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. గుజరాత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతోంది. చెన్నై కూడా ఇప్పటికే పలుసార్లు ఐపిఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. చెన్నైకు అపార అనుభవజ్ఞుడైన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహిస్తున్నాడు.

గుజరాత్‌కు కిందటి సారి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్య సారథిగా ఉన్నాడు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మోయిన్ అలీ, బెన్‌స్టోక్స్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, అజింక్య రహానె, శివం దూబే, డెవోన్ కాన్వే తదితరులతో చెన్నై బలంగా ఉంది. ఇక గుజరాత్‌లోనూ శుభ్‌మన్ గిల్, హార్దిక్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మాథ్యూ వేడ్, షమి, జోసెఫ్, శ్రీకర్ భరత్, విలియమ్సన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. దీంతో ఆరంభ మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News