Monday, December 23, 2024

ఒకప్పుడు 20 ఎకరాల జాగా ఉన్నా పిల్లను ఇయ్యకపొయ్యేది, ఇప్పుడు పరిస్థితి మారింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ఆలేరు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని సిఎం కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల కరెంటు రైతుల స్థితిగతులనే మార్చాయన్నారు. ఆలేరు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఇదివరకు 20 ఎకరాల జాగా ఉన్నా పిల్లను ఇయ్యకపోయేదని, అటెండర్ ఉద్యోగం ఉన్నా ఇచ్చెటోళ్లని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందన్నారు. తెలంగాణలో భుముల విలువ పెరిగిపోవడంతో ఉద్యోగం లేకపోయినా సరే జాగా ఉంటే పిల్లను ఇస్తున్నరని చెప్పారు. ‘భూముల కిరికిరి లేకుండా ధరణిని తీసుకొచ్చినం.

కానీ కాంగ్రెసోళ్లు ఆ ధరణిని కూడా తీసేస్తం అంటున్నరు. ధరణిని ఎత్తేస్తే రైతుబంధు ఎట్లొస్తది. భూముల రిజిస్ట్రేషన్‌లలో మళ్లీ అక్రమాలు మొదలైతయ్. ఇది ఆలోచించాలని మిమ్మల్ని కోరుతున్నా. ధరణి లేకపోతే అక్రమంగా ఒకరి పేరు మీది భూమి మరొకరి పేరు మీదకు మారుతది. ధరణి ఉంటే మీరు బొటన వేలు పెడితే తప్ప మీ పేరు మీది భూమిని ఇంకెవడూ తన పేరు మీదికి మార్చుకోలేడు’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘ధరణిని ఎత్తేయాలి, రైతుబంధు అక్కర్లేదు, 24 కరెంటు అవసరం లేదు అని కాంగ్రెస్ నేతలు అంటున్నరు. కాబట్టి మీరు బాగా ఆలోచించి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోండి. బాగా ఆలోచించి ఓటేయండ’ని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News