Monday, December 23, 2024

నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు

- Advertisement -
- Advertisement -

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్:  పార్లమెంట్‌లో పొగ బాంబుల దాడి ఘటనను ప్రశ్నించిన ఎంపిలను సస్పెండ్ చేయడం.. సభలో బిజెపి ప్రభుత్వం వ్యవహారిస్తున్న విధానాలను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్లమెంట్‌లో ఇండియా కూటమి ఎంపిలను అక్రమంగా, అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన అంశాలపై ఇండియా కూటమి నిరసన తెలుపుతుందని ఆయన తెలిపారు.

పొగ బాంబులు వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోందన్నారు. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపిలను సస్పెండ్ చేయడం దారుణమని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతారని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News