Friday, December 20, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్లు నిధులను ఉపసంహరించుకోవడం వంటివి మదుపరుల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దాంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. బజాజ్ ఆటో షేరయితే నేడు దాదాపు 13 శాతం మేరకు తగ్గింది.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 494.75 పాయింట్లు లేక 0.60 శాతం తగ్గి 81006.61 వద్ద ముగిసింది. నిఫ్టీ 221.46 పాయింట్లు లేక 0.89 శాతం తగ్గి 24749.85 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఎల్ టి, ఎస్ బిఐఎన్ ప్రధానంగా లాభపడగా, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, హిరో మోటోకార్పొ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News