Monday, December 23, 2024

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా రాకెట్ వేగంతో పరుగులు పెడుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. దీంతో పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. సామాన్య జనాలకు అందకుండా కొండెక్కి కూర్చుకున్న ధరలు దిగి వచ్చాయి. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500 తగ్గగా, 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.550 తగ్గింది. ఇక కిలో వెండిపై రూ.1000 తగ్గింది. తాజా తగ్గుదలతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,690గా ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,790 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,840గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబై,  బెంగళూరు, కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,790 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,840గా ఉంది.  చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,670గా ఉంది.

ఇక, తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.89,000గా ఉంది. ఇక, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.85,500 ఉండగా.. బెంగళూరులో రూ.86,000, చెన్నైలో రూ.89,000గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News