Sunday, April 6, 2025

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

పసిడి ప్రియులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ ఏడాది మొదటి నుంచి భారీగా పెరుగుతూ అందని ద్రాక్షలా మారిన బంగారం ధరలు కాస్తా దిగొచ్చాయి. పెళ్లీళ్ల సీజన్ ఉంటడంతో తులంగా బంగారం ఏకంగా 93 వేలు దాటింది. దీంతో సామాన్య ప్రజలు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. శనివారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 980 రూపాయలు తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 900 రూపాయలు తగ్గింది. దీంతో నగరంలో బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,660 రూపాయలు తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర 83,100కు చేరింది. అలాగే, వెండి ధర కూడా 100 రూపాయలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 10,7900గా ఉంది. ఎపిలోని ప్రధాన నగరాలు విశాఖపట్నం, విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News